ధీరుభాయి అంబానీ.. ఈ పేరు వల్ల భారతీయ మార్కెట్ ను షేక్ అవుతుంది. ప్రపంచ సంపన్నులు సైతం ఈ పేరు వింటే షాక్ అవుతారు. ఎటువంటి ప్రోత్సాహం లేదు, బ్యాక్ సపోర్టూ లేదు.. డబ్బు ఇంట్లో పుట్టలేదు. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. స్కూల్ స్టడీతోనే చదువుకు పుల్ స్టాప్ చెప్పేశాడు.
ఆ పైన చవడానికి.. స్థోమతగాని, అవకాశాలు కాని లేవు. జీరో నుండి మెదలు పెట్టి నేడు ఆయన పేరునే ఓ బ్రాండ్ గా చేసుకున్నాడు. అటువంటి వ్యక్తి జీవితం లోకి ఓ సారి తొంగిచూస్తే.. ఎన్నో నమ్మలేని నిజాలు.. ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పెట్రోల్ బంక్ లో కేవలం 300రూ.ల నెల జీతానికి పనిచేశాడు. అలా మొదలై దేశంలోనే నెంబర్-1 సంపన్నుడిగా ఎదిగాడు.. ఆయన ప్రస్థానం ఓసారి చూద్దాం..
* పర్యాటకులకు బజ్జీలు అమ్ముతూ జీవనాన్ని కొనసాగించాడు.
* 16 సంవత్సరాల్లో 10 వ తరగతి కంప్లీట్ చేసి పెట్రోల్ బంక్ లో నెలకు 300 రూపాయల జీతంపై యెమెన్ దేశంలో పనికి కుదిరాడు.
* 50 వేల రూపాయలను జమ చేసుకొని తిరిగి స్వదేశానికి వచ్చి, ఆ డబ్బులతో వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు.
* మూడు స్టూల్స్, ఒక ల్యాండ్ లైన్ ఫోన్, ఒక టేబుల్ గల ఓ చిన్న అద్దె గదిలో రిలయన్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు.
* విమల్ అనే బ్రాండ్ తో అహ్మదాబాద్ లో మొట్టమొదటి సారిగా ఓ బట్టల కంపెనీని స్టార్ట్ చేశాడు.
* అంచెలచెంచులుగా ఎదిగిన అంబానీతన కంపెనీలోని 35 వేల మంది షేర్ హోల్డర్స్ తో స్టేడియంలో మీటింగ్ పెట్టుకునే వాడు. ఓ కంపెనీ మీటింగ్ స్టేడియంలో పెట్టుకోవడం ఇదే ప్రథమం.
* 85వేల మంది ఉద్యోగులు గల ఈ కంపెనీ కట్టిన ట్యాక్స్ 1966 లో సెంట్రల్ బడ్జెట్ లో 5 శాతం.
* అంతర్జాతీయ స్థాయిలో షేర్ హోల్డర్స్ కలిగిన ఫస్ట్ భారతీయ కంపెనీ రిలయన్స్.
{youtube}v=gMlY-31TP84{/youtube}
Related
