Saturday, May 4, 2024
- Advertisement -

Fever Survey: తెలంగాణలో ఒక్క రోజు 45 వేల మందికి..

- Advertisement -

దేశంలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కొద్ది కాలంగా పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

జవవరి 21 నుంచి ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. కాగా ఒక్క రోజు నిర్వహించిన సర్వేలో ఎక్కువ మొత్తంలో ప్రజలు జ్వరం పలు సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. దాదాపు 45 వేల మంది జ్వరం, జలుబు, దగ్గు వంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.

దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య సిబ్బంది జ్వర సంబంధిత లక్షణాలతో బాదపడుతున్న వారికి కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరం ఉన్న వారికి మెడిసన్ కిట్లను అందజేస్తున్నారు. మరి కొందరిని సమీపంలోని ఆసుపత్రులకు పంపిస్తున్నారు. లక్షణాలు తగ్గేంత వరకు జనాల్లోకి రాకూడదని సూచిస్తున్నారు. పెద్ద వయసు వారిలోనే ఎక్కువగా పలు అనారోగ్య లక్షణాలు బయటపడుతున్నాయి. వారం రోజుల పాటు ఇంటింటా జ్వర సర్వే కొనసాగనుంది.

Also Read: పుష్ప సినిమాతో ప్రేరణ పొంది.. యువకుడిని చంపేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -