Sunday, May 5, 2024
- Advertisement -

మోడీని దూరం పెడుతున్న పవన్ ?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ సర్కార్ ను గద్దె దించి, తాము అధికారం చేపట్టాలని టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మూడు పార్టీలలో ముఖ్యంగా బీజేపీ, జనసేన పార్టీలు ఇంతవరకు ఏపీ లో అధికారం చేపట్టకపోవడంతో.. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. 2014 లోనూ, అలాగే 2019 లోనూ జనసేన పార్టీ బీజేపీ కి మద్దతు తెలుపుతూ వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఓటరిగా బరిలోకి దిగబోతున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు. అయితే జనసేనను దూరం పెట్టె విషయంలో బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది..

వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ తో సత్సంబంధాలు కొనసాగించేందుకే బిజెపి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. అయితే పవన్ మాత్రం బీజేపీతో కలిసేందుకు సిద్దంగా లేరని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసి నడ్డా మరియు ప్రధాని మోడీ వంటి వారిని కలిసేందుకు పిలుపు వచ్చిన పవన్ ఇతరత్రా కారణాలు చెప్పి కలవలేదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి పవన్ కు బీజేపీ ఆహ్వానం పంపిందట. రాష్ట్రపతిగా పదవి కాలం పూర్తి చేసుకుంటున్న రామ్ నాథ్ కొవింద్ కు సన్మాన సభ నిర్వహించబోతోంది బీజేపీ అధిష్టానం.. ఈ సభకు హాజరు కావాలని పవన్ కు ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ సమాచారం.

అయితే పవన్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఈ సభకు హాజరు కాలేనని చెప్పారట. దీంతో బీజేపీ కి పవన్ దూరంగా ఉండేందుకే.. పిలుపు అందుతున్న పవన్ వెళ్ళడం లేదనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో.. ఈ రెండేళ్లలో ఏమైనా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పొత్తులకు దూరంగా ఉన్న పవన్.. ఎన్నికల సమయానికి ఏదో ఒక పార్టీతో జట్టుకట్టే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే పవన్.. బీజేపీతో దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట.

Also Read

మోడీ సర్కారుపై ..వైసీపీ గుస్సా !

కే‌సి‌ఆర్ సీన్ రివర్స్ అవుతోందా ?

కాంగ్రెస్ హస్తం గందరగోళం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -