Friday, March 29, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ ను ప్రజలు నమ్మడం లేదా ?

- Advertisement -

తెలంగాణలో కే‌సి‌ఆర్ రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేయడం, పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు రచించడం, తన భాష, యాస తో పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఉత్సాహాన్ని నింపడం ఇవన్నీ కూడా కే‌సి‌ఆర్ కు వెన్నతో పెట్టిన విద్యా అని చెయ్యడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు కే‌సి‌ఆర్ ఏం చెప్పిన కూడా అందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుందని తెలంగాణ ప్రజలు బలంగా నమ్మేవారు. ముఖ్యంగా విభజనకు ముందు కే‌సి‌ఆర్ చేసిన ప్రసంగలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఆంద్ర వల్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నాని చెప్పినప్పుడు ప్రజలు గట్టిగానే నమ్మారు.

ఇక అలాగే కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపిస్తుందని, కేంద్రం నుంచి తెలంగాణ కు నిధులు రావడం లేదని, ఈ విధంగా కే‌సి‌ఆర్ ఏది చెప్పిన కూడా అందులో వాస్తవం ఉంటుందని ప్రజలు నమ్ముతూ వచ్చారు. అందువల్లే కే‌సి‌ఆర్ తన ప్రసంగాలలో ఏ అంశం గురించి మాట్లాడిన అది తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అయ్యేది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదనే చెప్పాలి. ఈ మద్య కాలంలో కే‌సి‌ఆర్ ఏది చెప్పిన కూడా సీన్ రివర్ అవుతోంది. ముఖ్యంగా ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు క్లౌడ్ బరస్ట్ అని, విదేశీ కుట్రలు అని చెప్పడం.. కాస్త హాస్యాస్పదంగానే మారాయి. కే‌సి‌ఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అటు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంచితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలలు వరదల వల్ల బయటపడకుండా టాపిక్ డైవర్ట్ చేసేందుకు పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, భద్రచలం మునిగిపోతుందని కే‌సి‌ఆర్ వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరనే స్పష్టంగా అర్థమౌతుంది. ఎందుకంటే ఇతవరకు పోలవరం పూర్తి కాలేదని ఆంధ్రలో ఇప్పటికీ నిరసనలు జరుగుతుంటే.. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని కే‌సి‌ఆర్ అనడం హాస్యాస్పదమే అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కే‌సి‌ఆర్ చెప్పిన ఏ అంశాన్ని కూడా గతంలో మాదిరిగా ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

Also Read

మోడీ సర్కారుపై ..వైసీపీ గుస్సా !

పెరిగిన ధరలు.. మోడీకి ప్రమాదమే ?

తెలంగాణలో హీటెక్కిస్తున్న కాంగ్రెస్ రాజకీయం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -