Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణలో హీటెక్కిస్తున్న కాంగ్రెస్ రాజకీయం !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ రోజు రోజుకు జోరు పెంచుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చైర్మెన్ పదవి చేపట్టిన తరువాత కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. అంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిలో ఉన్నప్పుడూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీపీసీసీ భాద్యతలు చేపట్టిన తరువాత వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి సక్సస్ అవుతున్నారనే చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్ ను విడిచిపెట్టిన నాయకులంతా కూడా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇటీవల తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అలాగే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టి‌ఆర్‌ఎస్ నేత ఆరేపల్లి మోహన్ సైతం మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. టి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన మరి కొంత మంది కూడా కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు సిద్దమౌతున్నారనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్నాయి. ఇలా పాత నాయకులతో పాటు కొత్త నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడంతో ఆ పార్టీ పూర్వ వైభవం సంతరించుకొనునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే కాంగ్రెస్ కు మొదటి నుంచి బలమైన నేతలుగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు ఆ పార్టీ విడేందుకు సిద్దమౌతుండడం.. కొంత ఆ పార్టీని కలవరపెట్టే అంశం.

టీపీసీసీ చైర్మెన్ పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రజల్లో గట్టి ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడంతో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇక అప్పటినుంచి కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారాయన. ఇటీవల ఆయన అమిత్ షా ను కాలవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా సిద్దమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా ఏది ఏమైనప్పటికి ఒకప్పుడు పార్టీని వీడిన వారు ఇప్పుడు తిరిగి పార్టీలో చేరుతుండడం.. అలాగే ప్రస్తుతం పార్టీలో బలమైన నేతలు కాంగ్రెస్ ను వీడుతుండడంతో.. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

More Like This

సోనియా గాంధీపై సానుభూతి వస్తుందా ?

కే‌సి‌ఆర్ మద్దతు.. ఎటువైపు ?

మోడీపై ఉమ్మడి పోరు సాధ్యమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -