- Advertisement -

ఈ అస్తిత్వం మీరే..ఎన్టీఆర్ ఎమోషనల్

- Advertisement -

నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే అంటూ తండ్రితో తనకున్న అనుబంధాన్ని ఎన్టీఆర్ అక్షరాల్లో పంచుకున్నారు.

అలాగే నందమూరి బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు సైతం హరికృష్ణకు నివాళి అర్పించారు. అభిమానులు సీతయ్య అని ముద్దుగా పిలుచుకునే నందమూరి హరికృష్ణ 1956, సెప్టెంబర్ 2న జన్మించారు. హరికృష్ణ చిన్న వయస్సులోనే శ్రీకృష్ణావతారం సినిమాలో బాలకృష్ణడి గా నటించారు.

దాన వీర శూర కర్ణ సినిమాలో అర్జునుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కాలం తరువాత శ్రీరాములయ్య సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. లాహిరి లాహిరి లాహరిలో.., సీతయ్య వంటి హిట్ సినిమాలో నటించి అభిమానులను అలరించారు. హరికృష్ణకు నలుగురు సంతానం. వీరిలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తన సత్తా చూపిస్తున్నారు. 2018 ఆగస్టు 29న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -