నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం “అఖండ 2: తాండవం”. ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, బాలయ్య మరో యాక్షన్ డ్రామాకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా NBK111 అని పేరు పెట్టారు.
ఇప్పుడీ చిత్రం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, చిత్ర బృందం రేపు హీరోయిన్ను అధికారికంగా ప్రకటించనున్నట్టు ప్రకటించింది. సమయాన్ని కూడా ఖరారు చేశారు — మధ్యాహ్నం 12:01 గంటలకు. అధికారిక పోస్టర్లో ఇలా పేర్కొన్నారు . చరిత్ర యుద్ధభూమి తన రాణి మహిమాన్వితమైన ప్రవేశాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. ఆ సామ్రాజ్యం రేపు ఆమె అద్భుతమైన, శౌర్యవంతమైన ఆగమనాన్ని సాక్షిగా చూడబోతుంది అన్నారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వృద్దీ సినిమాస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. NBK111 గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
