- Advertisement -

రచయిత బొగ్గుల శ్రీనివాస్ ఒంటిపై గాయాలు..!

- Advertisement -

పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో’ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లో మునిగిన కారులో శ్రీనివాస్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన విషయం తెలిసిందే. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ ఒంటిపై గాయాలు ఉన్నాయని, ఇది సహజ మరణం కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోస్టుమార్టం నివేదికలో కూడా శ్రీనివాస్ శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా, ఆయన నీటిలో మునిగి చనిపోలేదనే అంశం దర్యాప్తులో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసు మలుపుతిరిగింది. ఘటనాస్థలిలో లభ్యమైన ఆధారాలు, ఫోరెన్సిక్ వివరాల ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

కారు నీటిలో మునిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను హైదరాబాద్ ప్రాంతంలో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని అధికారులు తెలిపారు. కారు యజమాని, డ్రైవర్‌లను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -