ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి పట్టణంలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. సీతారాముల కల్యాణం సందర్భంగా మంత్రి ప్రవర్తనపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వేడుకలకు హాజరైన ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పులు వేసుకున్నట్లుగానే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా, పట్టువస్త్రాలు కూడా పాదరక్షలతోనే తీసుకెళ్లారు.
హిందూ సంప్రదాయాల ప్రకారం దేవాలయాల్లో పూజల సమయంలో పాదరక్షలు తొలగించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ నేపథ్యంలో మంత్రి ఇలా వ్యవహరించడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పలువురు భక్తులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చ మొదలైంది. ప్రజా ప్రతినిధులు సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటనపై మంత్రి లేదా సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు స్పష్టమైన స్పందించలేదు.
