- Advertisement -

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ధర్నా

- Advertisement -

ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నడిరోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.జాతీయ రహదారి వెంట ఉన్న ప్రభుత్వ స్థలాలు అక్రమంగా కబ్జా అవుతున్నాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ప్రభుత్వ భూములను ఆక్రమించడం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కబ్జాదారులను వెంటనే ఖాళీ చేయించాలని, సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనకు స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం కఠిన చర్యలు అవసరమని వారు కూడా అభిప్రాయపడ్డారు.అక్రమ కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ పరిణామంతో తిరువూరులో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూముల సంరక్షణ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -