- Advertisement -

షాకింగ్..రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన బాలుడు

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో గుండెలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారుల బాధ్యతారాహిత్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడింది. రైలు ప్రయాణంలో ఉండగా ఒక బాలుడు ప్రమాదవశాత్తు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందపడిపోయాడు. కళ్లముందే తమ్ముడు కిందపడిపోవడంతో ఆ సోదరి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే తోటి ప్రయాణికులు స్పందించి ఎమర్జెన్సీ చైన్ లాగినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

చైన్ లాగినా పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ఏకంగా 15 కిలోమీటర్ల వరకు ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు.తన తమ్ముడిని కాపాడాలంటూ ఆ సోదరి కన్నీరుమున్నీరుగా విలపించింది. సాయం కోసం అక్కడే ఉన్న TTEని ప్రాధేయపడినా, రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా సరైన స్పందన లభించలేదు.

ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. తమ్ముడి కోసం ఆ సోదరి పడుతున్న ఆవేదన చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన రైల్వే వ్యవస్థపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చైన్ లాగినా ఆపకపోతే ఇక ఆ వ్యవస్థ ఉండి లాభం ఏంటి?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులైన లోకో పైలట్ మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -