- Advertisement -

ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక అవసరాల కోసం మరోసారి భారీగా అప్పులు చేసింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణ కోసం నిధుల కొరత ఏర్పడటంతో ప్రభుత్వం మార్కెట్ రుణాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇందులో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెక్యూరిటీల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం మరో రూ.4,600 కోట్ల అప్పు తీసుకుంది.

జూన్ నెల మొదటి మంగళవారమే భారీగా రుణాలు సేకరించిన సర్కార్…కేవలం 15 రోజుల వ్యవధిలోనే మొత్తం రూ.9,000 కోట్ల మేర అప్పులు చేయడం గమనార్హం. ప్రతి మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించే బాండ్ల వేలమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన నిధుల వనరుగా మారింది.

ఈ తాజా రుణంతో కలిపి గత 25 నెలల కాలంలో బాబు ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుల విలువ అక్షరాలా రూ.3,49,094 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వివరాలు పరిశీలిస్తే… ప్రభుత్వం అధికారికంగా బడ్జెట్‌లో చూపించిన అప్పులు రూ.1,89,600 కోట్లుగా ఉన్నాయి.

బడ్జెట్ పరిధి వెలుపల వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల ద్వారా తెచ్చిన అప్పులు రూ.1,12,504 కోట్లకు చేరాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన పేరుతో బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుండి రూ.47,387 కోట్ల అప్పు సేకరించారు.

రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరగకపోవడం, మరోవైపు గ్యారంటీల అమలుకు నిధులు అవసరం కావడంతో అప్పుల భారం నానాటికీ పెరుగుతోంది. ఈ వడ్డీల భారం భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -