- Advertisement -

విద్యార్థుల మృతిపై బరితెగింపు మాటలా?

- Advertisement -

వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలంలో జరిగిన ఘోర విషాదంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఇసుక గోతుల్లో పడి మరణిస్తే.. కావాలనే ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని అసత్య ప్రచారం చేశారు. కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, మరణించిన పిల్లలపై హేయంగా మాట్లాడటంపై స్థానిక గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చక్రాయపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లు సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లారు. అయితే, అక్కడ ఇసుక కోసం తవ్విన లోతైన గుంతల్లో చిక్కుకుని ఆ ఇద్దరు ముక్కుపచ్చలారని విద్యార్థులు ప్రాణాలు విడిచారు. పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత నదిలోని ఇసుక గోతుల్లో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులే నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తోడేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇసుక మాఫియా ఆగడాలపై గతంలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఇద్దరు విద్యార్థులు బలికావాల్సి వచ్చిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -