- Advertisement -

పండుగలా రోహిత్ రిటైర్మెంట్!

- Advertisement -

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ (రిటైర్ కాబోతున్నారనే) వార్తలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే (3rd ODI) రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిణామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత మాజీ దిగ్గజం, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ . రోహిత్ శర్మ రిటైర్మెంట్‌ను చూసి బాధపడటం కంటే…అతని సుదీర్ఘ కెరీర్‌ను పండుగలా జరుపుకోవాలని కితాబిచ్చారు.

లేదు, మనం సంతోషంగా ఉందాం. దీనికి విచారించడం ఎందుకు? ఇన్నేళ్లుగా రోహిత్ మనకు ఎంతో సంతోషాన్ని, వినోదాన్ని అందించాడు. ఒక ఆటగాడిగా ఎవరైనా ఒకరోజు గుడ్-బై చెప్పాల్సిందే. గతంలో సునీల్ గవాస్కర్ వెళ్ళిపోయారు, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్.. ఇలా ప్రతి ఒక్కరూ రిటైర్ అయ్యారు. అందరూ ఒకరోజు వెళ్లవలసిన వారే అని కపిల్ దేవ్ అన్నారు.

భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు రోహిత్ శర్మ అందించిన వినోదాన్ని మనం గుర్తుచేసుకోవాలని కపిల్ దేవ్ హితవు పలికారు. అతను రిటైర్ అయినప్పుడు, అతని అద్భుతమైన కెరీర్‌ను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాని బాధపడకూడదు. అవును, అతను ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే. ఒకవేళ ఇదే అతని చివరి మ్యాచ్ అయితే లార్డ్స్‌లో అద్భుతమైన సెంచరీ బాది ఘనంగా కెరీర్‌ను ముగించాలని నేను కోరుకుంటున్నాను అని రోహిత్ శర్మకు బెస్ట్ విషెస్ తెలిపారు.

39 ఏళ్ల రోహిత్ శర్మ 2007 జూన్ 23న ఐర్లాండ్‌పై వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నారు. మొదటి రెండు వన్డేల్లో ఆయన కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేశారు. ఈ ఏడాది (2026) ఆడిన 8 వన్డేల్లో 30.12 సగటుతో, 79 అత్యధిక స్కోరుతో కేవలం 241 పరుగులు మాత్రమే చేయగలిగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -