అస్సాం రైల్వేస్ మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను భారత పురుషుల క్రికెట్ జట్టు నూతన ఫీల్డింగ్ కోచ్‌గా నియమించారు. టీ దిలీప్ తన పదవి నుంచి తప్పుకున్న తర్వాత శుభదీప్ ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ నెల చివర్లో జరగనున్న శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగే టెస్టు సిరీస్ నుండి ఆయన తొలి అసైన్మెంట్ ప్రారంభం కానుంది.
గత కొన్నేళ్లుగా వివిధ వయోవిభాగాల భారత జట్లతో పనిచేస్తూ ఆయన ప్రతిష్టాత్మక కోచింగ్ రికార్డును నిర్మించుకున్నారు. తన నిబద్ధత, నైపుణ్యంతో గుర్తింపు పొందారు అని అస్సాం క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.అస్సాంకు చెందిన వ్యక్తి ఈ అరుదైన ఘనత సాధించడం అస్సాం క్రికెట్ అసోసియేషన్‌కు ఎంతో గర్వకారణం. ఆయన నియామకం రాష్ట్ర క్రికెట్ వర్గాలకు గొప్ప గౌరవం మరియు ప్రాంతంలోని వర్ధమాన క్రికెటర్లకు, కోచ్‌లకు స్పూర్తినిస్తుంది అని పేర్కొంది.
టీ దిలీప్ 2021 నుండి 2026 వరకు దాదాపు ఐదేళ్ల పాటు భారత ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ బృందంలో భాగమైన ఆయన, సపోర్ట్ స్టాఫ్‌లో ఎంతో ఆదరణ పొందిన సభ్యుడిగా నిలిచారు. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో ‘బెస్ట్ ఫీల్డింగ్ మెడల్’ వేడుకల సంప్రదాయాన్ని ప్రారంభించింది ఈయనే. 2024 టి20 ప్రపంచ కప్ విజయం తర్వాత మిగిలిన సపోర్ట్ స్టాఫ్ వైదొలిగినప్పటికీ, గంభీర్ బృందంలో కాంట్రాక్ట్ పొడిగింపు పొందిన ఏకైక వ్యక్తి దిలీప్ మాత్రమే. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఆయన పదవీకాలాన్ని మరొక ఏడాది పొడిగించినప్పటికీ, ఈసారి పొడిగింపు లభించలేదు.
