- Advertisement -

చరణ్ కోసం.. పల్లెటూరు సెట్..

- Advertisement -

సినిమాలో ఉన్నవి.. లేనట్టు చూపించడం.. లేనివి ఉన్నట్లు చూపించడం పెద్ద కష్టమైన పని మాత్రం కాదు. ఇప్పుడు వస్తున్న సినిమాల కథల కోసం భారీ సెట్లు వేస్తున్నారు. కానీ అదే కథ ఇప్పటి కాలానికి కొన్ని దశాబ్ధాలు కాలం వెనక కథ అయితే ఆ కాలం నాటి వాతావరణం నిర్మించవలిసి వస్తుంది కదా. ”రంగస్థలం 1985” కోసం అదే పరిస్థితి ఎదురైంది, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985 సినిమా షూటింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది.

ఈ సినిమా కోసం రంగస్థలం 1985 యూనిట్ అంతా కొన్ని రోజులు గోదావరి నది ఒడ్డున ముఖ్యమైన సీన్లు పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తికావడంతో హైదరాబాద్ చేరుకున్నారు చిత్ర యూనిట్. ఇక్కడ హైదరాబాద్ లో రంగస్థలం 1985 కోసం ఏకంగా 5 కోట్లు వ్యయంతో గోదావరిలో ఉండే ఊరిని తలపించేలా సెట్ నిర్మిస్తున్నారట. 1980లో ఉండే అప్పటి గుడిసెలు ఆ కాలం నాటి ఇల్లులు వీదులు గుర్తుకువచ్చేలాంటి ఒక ఊరిని హైదరాబాద్లో నిర్మిస్తున్నారు.

ఈ సెట్ లోనే 24 నుండి విరామం లేకుండా 35 రోజులు షెడ్యూల్ జరుగుతుందని తెలుస్తోంది. పల్లెటూరు ప్రేమ కథ అయిన రంగస్థలం 1985 లో రామ్ చరణ్ కు జంటగా సమంత నటిస్తుంది. ఈ సినిమాలో ఆది పనిశెట్టి ఇంకా జగపతి బాబు.. యాంకర్ అనసూయ ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -