టాలీవుడ్ డ్రగ్స్‌కేసు ఎలాంటి సంచలనాలకు తెరతీసిందో చూస్తున్నాం.నోటీసులు ఇచ్చివారిని సిట్ అధికారలు విచారిస్తున్నారు.ఇక ఛార్మి ఏకంగా కోర్టుకు వెల్లింది.అయితే ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.విచారన సమయంలో నిదులనుంచి బ్లడ్,వెంట్రులకలు,గోర్లను శాంపిల్స్‌గా సేకరిస్తున్నారు అధికారలు.
అయితే అది ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. బలవంతంగా శాంపిల్స్‌ను సేకరిస్తున్నారనే ఆరోపనలు అధికారలు మీద వస్తున్నాయి.అయితే అధికారల వాదన మరోలా ఉంది.సిట్ విచారణకు వచ్చేవారు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారని ఎక్సైజ్ శాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
సినీ ప్రముఖులు విచారణకు వచ్చే సమయంలో అలోవెరా డ్రింక్ తాగి వస్తున్నారని ఎక్సైజ్‌శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్రింక్ తాగడం వల్ల కడుపు శుభ్రంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు
అనవాలు బయట పడకుండా పకడ్బందీగా విచారనకు హజరవుతున్నట్లు తెలుస్తోంది.డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు జ్యూస్ లు తాగే ప్రయత్నం చేయడం, తల వెంట్రుకల్లో ఆధారాలు లభించకుండా ఉండేందుకు హైలీ కాస్మోటిక్ షాంపూలతో తలస్నానం చేసి విచారణకు వస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్టు విచారణా సమయంలో చెబుతున్నారని, డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
