టీడీపీ సీనియర్ నేతల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు ఒకరు. గతంలో టీడీపీ నగరినుంచి వైసీపీ అభ్యర్తి రోజాపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరలో మంత్రి పదవి వస్తాదని అశ పెట్టుకున్న గాలి ముద్దు కృష్ణమనాయుడి ఆశల ఉఅడియాశలయ్యారు. మంత్రి పదవి ఇవ్వకుండా బాబు మొండి చేయి చూపడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాని ఇప్పుడు గాలి పరిస్థితి గాల్లో దీపంలా తయారయ్యింది.
వైసీపీ మహిళానేత రోజాకు చెక్ పెట్టేందుకు అలనాటి హీరోయిన్ వాణీవిశ్వనాథ్‌ను టీడీపీలోకి తీసుకొస్తున్నారు. గతంలో ఆమె స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు ఎంతో ఇష్టమని.. రాజకీయాల్లో ఆయన ఓ రోల్ మోడల్ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చేఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ వస్తే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీ చేస్తానని ప్రకటించారు.
ఈ మధ్య చిత్తూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఆమెను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు త్వరలోనే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. అమరావతి వేదికగా త్వరలోనే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు
గతంలో చిత్తూరు నుంచి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయనే ఇంఛార్జ్‌గా వున్నారు. అలాంటి తరుణంలో పార్టీలో చేరకముందే వాణి విశ్వనాథ్ నగరి నుంచి పోటీ చేస్తాననడం గాలికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది.
ఇష్టానుసారంగా తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై గతంలో గాలి ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. మరి గాలికి నగరి టికెట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. టికెట్ ఇవ్వకుంటె ఖశ్చితంగా పార్టీ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పార్టీ మారితే జనసేనా లేకా వైసీపీలు మాత్రమె ప్రత్యామ్నాయం.
