మహానుభావుడు హిట్‌తో ఊపుమీదున్న యువ నటుడు శర్వానంద్ తన మరో సినిమాను ప్రారంభించాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ సినిమాస్ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. శర్వానంద్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నాడు.
తన మిత్రులు ప్రసాద్, సుధాకర్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, సూపర్‌హిట్ చిత్రం అందిస్తా అని దర్శకుడు హను తెలిపారు. కార్యక్రమానికి నిర్మాతలు వై. రవిశంకర్, ఎస్. రాధాకృష్ణ, అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట, బాపినీడు, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
అయితే ఈ సినిమాలో శర్వా సరసన ఫిదా ఫేమ్ సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. సాయిపల్లవి శర్వాకు తోడైతే సినిమాకు మంచి ప్లసయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో చిత్ర వివరాలు అన్నీ వెల్లడిస్తారని చిత్రబృందం తెలిపింది. వినూత్న పంథాలో సాగే పక్కా ప్రేమకథ ఇది అని తెలుస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చెప్పారు.
https://www.youtube.com/watch?v=PPyIVFUtc2Y
