- Advertisement -

అభివృద్ధి క‌నిపించ‌ట్లేదా వైసీపీ నాయ‌కులకు…మంత్రి ప‌రిటాల సునీత‌

- Advertisement -

పరిటాల రవీంద్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టించారనే వార్త‌లు గ‌తంలో ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. అది నిజ‌మా లేకా అబ‌ద్ద‌మా అనేది దేవుడెరుగు. ఆవిష‌యాన్ని అందరూ మ‌ర‌చిపోయారు. కాని రెండు రోజుల కింద‌ట ప‌వ‌న్ దాన్ని మ‌రో సారి గెలుక్కున్నాడు. త‌న‌కు ప‌ర్య‌టాల ర‌వి గుండు కొట్టించ‌లేద‌ని అది అబ‌ద్ద‌మ‌ని సినిమాల మీద విర‌క్తితోనె గుండు కొట్టించుకున్నాని పవ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా ఇదే విష‌యంపై మంత్రి ప‌రిటాల సునీత తొలిసారి స్పందించారు. తన భర్తకు, పవన్ కల్యాణ్ కూ సంబంధమే లేదని, ఈ విషయంలో పవన్ నిజమే చెప్పారని అన్నారు. అసలు పరిటాల రవి, పవన్ కు గుండు ఎందుకు కొట్టిస్తారని ప్రశ్నించారు. తన భర్త అంత మూర్ఖుడు కాదని, ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

మ‌రో వైపు జ‌గ‌న్‌పై కూడా విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని, కంటిముందు జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తున్నాజ‌గ‌న్‌, వైసీపీ నేతలకు మాత్రమే అదంతా బూటకంగా కనిపిస్తోందని సునీత విమర్శలు గుప్పించారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఉరవకొండలో ముగిసి పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో అడుగు పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -