- Advertisement -
జియో టెలికం మార్రెట్‌లోకి వచ్చిన తర్వాత అన్ని ప్రయివేటు, ప్రభుత్వ టెలికం కంపెనీలు ఆఫర్లమీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగసంస్థ బీఎస్ఎన్ఎల్‌తో కలిసి కెనడాకు చెందిన డేటావిండ్ సంస్థ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రోజుకు కేవలం ఒక్క రూపాయితో అపరిమిత డేటాను అందించనున్నట్టు డేటావిండ్ వెల్లడించింది.
నెలకు రూ. 30 ఖర్చుతో డేటావిండ్ స్మార్ట్ ఫోన్లలో నెలంతా అన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించవచ్చని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ తో డీల్ చివరి దశకు వచ్చిందని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపాయి.
