- Advertisement -

వైకాపాలో భారీ చేరికలు, జగన్‌కి అనుకూలంగా సర్వేలు బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా?

- Advertisement -

వైఎస్ జగన్ కాంగ్రస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచీ ఇదే రాజకీయం. ముఖాముఖీ నిలబడి ప్రజల సమక్షంలో బలం తేల్చుకునే ధైర్యం లేదు. నిజాయితీగా ఎన్నికల్లో బలబలాలు తేల్చుకోవడానికి భయం. అందుకే అన్నీ కూడా రాజకీయంగా కుట్రలు పన్నే వ్యవహారాలే. కాంగ్రెస్ అంటే కిలో మీటర్ల దూరం పాటిస్తాం అని మాటలు చెప్తారు. కానీ అదే కాంగ్రెస్ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రంలో మద్దతిస్తారు. ఇక కేంద్రంలో కూడా రాజ్యసభలో మద్దతిచ్చారు. చిదంబరంతో బాబు సీక్రెట్ మీటింగుల గురించి చిదంబరమే సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే వెల్లడించారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి టిడిపి నేతలు జగన్‌పై వేసిన కేసులు…….అన్నీ కూడా జగన్‌ ప్రజా బలాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పన్నిన వ్యూహాలే, కుట్రలే. జగన్‌ని ఒక్కడిని దెబ్బకొట్టడం కోసం కిరణ్ కుమార్‌రెడ్డిని కాపాడడం…….ఆ తర్వాత రాష్ట్ర విభజన వ్యవహారానికి తెరలేవడం…..సీమాంధ్ర ప్రజలు పూర్తి స్థాయిలో నష్టపోవడం……..అయినప్పటికీ 2014ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేక హోదాతో సహా ఎన్నో హామీలు, రుణమాఫీలు, మోడీ మేనియా వాడుకోవడం, రాష్ట్ర విభజనకు సహకరించిన బిజెపికి సీమాంధ్ర ప్రజలు ఓట్లేసేలే చేయడం, భజనసేనుడు పవన్ కళ్యాణ్ నటనావేశం…….మొత్తానికి విజయం అయితే సాధించి మమ అనుకున్నారు.

కట్ చేస్తే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ చేసింది ఏమీ లేదు. చంద్రబాబుతో సహా, పవన్ కళ్యాణ్, పచ్చబ్యాచ్ అంతా కలిసి సీమాంధ్ర ప్రజల నెత్తిన రుద్దిన మోడీ దగ్గర కూడా ఓటుకు కోట్లు కేసు పుణ్యమాని సాగిలపడాల్సిన పరిస్థితి. హోదాతో సహా అన్ని హమీలకు తానే మంగళం పాడాల్సిన పరిస్థితి. భజనసేనుడు కూడా మరీ బఫూన్ స్థాయికి దిగజారిపోయాడు. ఇలాంటి పరిణామాలతో పాటు ప్రజా సంకల్ప యాత్ర పుణ్యమాని ప్రజల్లో జగన్‌కిక ఆదరణ భారీగా పెరుగుతోంది. జాతీయ స్థాయి మీడియా సంస్థల సర్వేలు జగన్ గెలుపు ఖాయమని చెప్తున్నాయి. దేశం మొత్తం మీద కూడా మరోసారి మోడీ గెలుపు ఖాయం అని చెప్తున్న సర్వేలు……టిడిపితో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి కూడా గల్లంతవడం ఖాయం అని చెప్తున్నాయి. అలాంటి నేపథ్యంలో వైకాపాలు చేరికలు భారీగా పెరుగుతున్నాయి. స్వయానా టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులే వైకాపాలో చేరుతున్నారు. జగన్ గెలుపు ఖాయమని అర్థమైన టిడిపి సీనియర్లే భవిష్యత్ కోసం తెలివిగా వారసులను వైకాపాలోకి పంపిస్తున్నారన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. టిడిపి సీనియర్ నేతలు కూడా అనుక్షణం ప్రజల మధ్య ఉంటున్న వైఎస్ జగన్ లక్షణం గురించి ప్రశంశలు కురిపిస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు అయితే జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని ఫిక్స్ అయినట్టుగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో కూడా బాబును సమర్థించిన బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు…..ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చుని చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు.

ఈ పరిణామాలన్నీ కూడా బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్‌కి పెరుగుతున్న మద్దుతును చూసి ఉక్రోషం తట్టుకోలేకపోతున్న బాబు మరోసారి జగన్ అక్రమాస్తుల వ్యవహారం అంటూ ఓల్డ్ సాంగ్ పాడడం మొదలెట్టాడు. 2014ఎన్నికల సమయంలో రుణమాఫీలు ఎలా చేస్తావు అని అడిగితే జగన్ అక్రమాస్తులు స్వాధీనం చేసుకుని చేస్తాను అన్న చంద్రబాబు…….ఇప్పటివరకూ జగన్‌వి అక్రమాస్తులు అని నిరూపించింది కానీ ఒక్క రూపాయి అన్నా స్వాధీనం చేసుకుంది కానీ లేదు. నిజానికి బాబువన్నీ అబద్ధాలే అని విశ్లేషకులు ఇప్పటికే చాలా సార్లు తేల్చేశారు. వైకాపా నాయకులు కూడా దమ్ముంటే జగన్‌వి అక్రమాస్తులు అని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ సవాల్‌కి సమాధానం చెప్పలేని బాబు…….ఇప్పుడు తాజాగా జగన్ అక్రమాస్తులను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని కొత్తపాట మొదలెట్టారు. చంద్రబాబు ఉక్రోషం అయితే అర్థమవుతూనే ఉంది…….కానీ 2019లో కూడా వైఎస్ జగన్ అక్రమాస్తులు అంటూ చంద్రబాబు అదే ఓల్డ్ సాంగ్ మొదలెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వింటారా? ఐదేళ్ళలో పూర్తిగా ఫెయిల్ అయిన చంద్రబాబు పాలనా వైఫల్యం గురించి అడగరా? ఏడు దశాబ్ధాలుగా ముఖ్యమంత్రులందరూ కూడా సీమాంధ్రకు తొంభై వేల కోట్లు అప్పులు మిగిలిస్తే ……బాబు మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకూ లక్షా ఇరవై వేల కోట్ల అప్పులు తీసుకుని వచ్చాడు. మరి ఆ లక్షా ఇరవై వేల కోట్లు ఏం చేశావని జనాలు అడగరా? తాను ఇచ్చిన రుణమాఫీ హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన హోదాలాంటి హామీలకు కూడా మంగళంపాడేసీ సీమాంధ్రులను పూర్తిగా ముంచినవాళ్ళు ఇప్పుడు 2019ఎన్నికలే లక్ష్యంగా సానుభూతి డ్రామాలు, జగన్‌ని విలన్‌గా చిత్రీకరించే విష ప్రచారాలు మరోసారి మొదలెట్టేశారు అని వినిపిస్తున్న మాటలు మాత్రం నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -