- Advertisement -

బాబుపై టిడిపి నేతల తీవ్ర విమర్శలు…. 2019లో టికెట్ ఇవ్వనన్న బాబు

- Advertisement -

చంద్రబాబుపై ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే సామాన్య ప్రజలకంటే కూడా టిడిపి నేతల్లోనే ఇప్పుడు చంద్రబాబుపై ఆగ్రహావేశాలు ఓ స్థాయిలో పెల్లుబుకుతున్నాయి. చంద్రబాబు నాయకత్వ సామర్థ్యంపైనే టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఫెయిల్ అయ్యారని టిడిపి నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యేక హోదాతో సహా చాలా విషయాల్లో చంద్రబాబు ఆలోచన లేకుండా వ్యవహరించారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

రీసెంట్‌గా జరిగిన టిడిపి సమావేశంలోనే ఆ పార్టీ సీనియర్ నాయకులు బాబు నిర్ణయాలను పూర్తిగా తప్పుపట్టారు. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పి అధికారంలోకి వచ్చి……ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత మోడీ చేతిలో మోసపోయా అని ప్రజల ముందు కన్నీరు కారుస్తుంటే ప్రజలందరూ కూడా ఎటకారంగా చూస్తున్నారని చంద్రబాబుతోనే డైరెక్ట్‌గా చెప్పేశారు టిడిపి నేతలు. మోడీకంటే సీనియర్‌ని, దేశంలోనే సీనియర్ నాయకుడిని అని చెప్పుకున్న చంద్రబాబు……మోసపోయానని ఇప్పుడు అమాయకంగా చెప్పడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని టిడిపి నేతలు చంద్రబాబుతో చెప్పారు. హోదాతో సహా చాలా విషయాల్లో చంద్రబాబుకంటే జగనే గొప్పగా ఆలోచించాడని, ముందు చూపుతో వ్యవహరించి ప్యాకేజ్‌కి ఒప్పుకోవద్దని చంద్రబాబును కూడా హెచ్చరించారని ప్రజలు చెప్పుకుంటున్నారని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో పూటకో మాట మార్చడం పార్టీకి భారీగా నష్టాన్నే మిగిల్చిందని టిడిపి నేతలు చంద్రబాబుతో చెప్పారు. ఇప్పుడిక చంద్రబాబుతో సహా టిడిపి నేతలెవ్వరి మాటలనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని…..నాలుగేళ్ళలో పార్టీ విశ్వసనీయత పూర్తిగా నాశనమైందని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. అయితే చంద్రబాబు మాత్రం విమర్శలు చేసిన నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. 2014లో నా కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని……2019లో కూడా నా కష్టమే పార్టీని గెలిపిస్తుందని……తేరగా వచ్చిన పదవులు అనుభవిస్తూ నాపైనే విమర్శలు చేయడం ఏంటని నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని…..అందరూ కూడా అధినాయత్వం చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని……అలా కాని పక్షంలో ఎవ్వరికీ కూడా టికెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని చంద్రబాబు ఆయా నాయకులను హెచ్చరించాడని టిడిపి నాయకులే చెప్పుకొస్తున్నారు. టిడిపిలో ఉన్న అంసతృప్త నాయకుల చర్యలు ముందు ముందు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -