- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అరవింద సమేత. ఈ సినిమా షూటింగ్ నగర శివార్లలో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటిస్తుంది. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దసరా కానుకగా సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. సినిమాలో మరో హీరోయిన్‌గా ఇషా రెబ్బను తీసుకున్న సంగతి తెలిసింది.
