- Advertisement -
నల్లగొండ జిల్లా యదాద్రిలో లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. వేదమంత్రాలు, ప్రత్యేక పూజల మధ్య ఆలయ మండపంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.. లక్ష్మీ నృసింహుడిని పట్టువస్త్రాలు, బంగారు ముత్యాలతో అలంకరించారు..
దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంతో ఉత్సవాలు మొదలయ్యాయి.. ఆ తర్వాత అర్చకులు ఆలయ చరిత్రను భక్తులకు వివరించారు.. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.. 

