Monday, May 20, 2024
- Advertisement -

కేసీఆర్‌కు ఫోన్ చేసిన బీహార్ సీఎం నితీస్‌కుమార్..

- Advertisement -

ఈ నెల 9వ తేదీన జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో తమకు మద్దతు తెలపాలంటూ జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫోన్ చేశారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.

అయితే రాజ్యసభలో ఏ పార్టీకి, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేక‌పోవ‌డంతో ప్రధాన పక్షమైన బీజేపీ ఈ పదవిని తమ మిత్రపక్షమైన జేడీయూకి ఇవ్వాలని భావిస్తోంది. తమ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను జేడీయూ అధినేత నితీష్ కుమార్ బరిలోకి దింపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు నితీష్ పలువురికి ఫోన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌కు ఫోన్ చేశారు. మంగళవారం సాయంత్రం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీకాలం ముగిసింది. దీంతో జూలై 1 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్, టీఎంసీలు కూడా ఈ పదవిని కోరుకుంటున్నాయి. విపక్షాల నుంచి ఎన్డీయేకు గట్టి పోటీ ఉంది. అయితే జేడీయూ నేత నితీష్ మద్దతు కూడగట్టగలరని ఎన్డీయే పార్టీలు భావిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -