తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల తరువాత అందరు కళ్లు ఓ వ్యక్తి కోసం ఆసక్తిగా వెతికాయి.అతను మరెవ్వరో కాదు నటుడు,నిర్మాత కాంగ్రెస్ పార్టీ లీడర్ బండ్ల గణేష్.ఎన్నికల ముందు ఓ తెగ హడావిడి చేసిన బండ్ల ఎన్నికలు తరువాత కొన్ని మీడియా ఛానెల్స్‌లో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహకూటమి అధికారంలోకి రాకపోతే గాంధీభవన్ సాక్షిగా నా పీక ఆక్సా బ్లేడ్‌తో కోసుకుంటానని చెప్పిన బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాలు తరువాత ఎక్కడ కనిపించలేదు.ఇక ప్రజకూటమి అధికారంలోకి రానున్నట్లు డైలాగ్స్ కొట్టిన నేతలు ఇప్పుడు ఎక్కడా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఎలక్షన్స్ కి ముందుకు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లెడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పిన బండ్లన్న ఇప్పుడు ఎక్కడా అంటూ అనేక రకాల మేమ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు. అంటూ బండ్ల గణేష్ సైలెంట్ గా వివరణ ఇచ్చాడు. ట్విట్ ఓకే మరి పీక ఎప్పుడు కోసుకుంటావ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
- పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ టీజర్ అవుట్
- ‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..
- వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్‌ను కొట్టి చంపిన భార్య!
- బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ అండ
- జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీలక వ్యాఖ్యలు !
