అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇటీవలే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మొదటి సినిమాతోనే తల్లికి తగ్గ కూతురనింపించుకుంది జాన్వీ. తాజాగా ఆమె ఓ కేంద్రమంత్రికి క్షమాపణలు చెప్పడం చర్చనీయాశంగా మారింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనను ఎవరైన ఆంటీ అని పిలిస్తే నాకు అక్కడిక్కడే చనిపోవాలనిపిస్తుందని గతంలో ఓ సారి చెప్పారు.తాజాగా స్మృతి ఇరానీని ఆంటీ అని పిలిచిందట జాన్వీ.
ఇటీవల ఎయిర్ పోర్ట్ లో జాన్వీ కపూర్, స్మృతి ఇరానీ అనుకోకుండా కలిశారట. అలా కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతు స్మృతి ఇరానీని ఆంటీ అని సంబోదించారట. దీంతో కాస్తా ఫీల్ అయ్యారట స్మృతి ఇరానీ.కాసేపటి తరువాత అలా పిలిచినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు నేను ఏం పర్వాలేదు బేటా అని చెప్పాను. ఈ కాలం పిల్లలు ఉన్నారే.. నన్ను అలా ఆంటీ అని పిలుస్తుంటే ఎవరైనా నన్ను షూట్ చేయండని అరవాలనిపించింది” అంటూ చమత్కరించారు స్మృతి ఇరానీ.
- దిగొచ్చిన దీదీ..కూటమి సమావేశానికి!
- 30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్గా అక్రమకేసులు!
