యంగ్ హీరోలలో నిఖిల్ విభిన్న కథలను ఎంచుకుంటు వరుస విజయాలను అందుకుంటున్నాడు. నిఖిల్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన కణిథన్ అనే సినిమాను తెలుగులో చేస్తున్నాడు హీరో నిఖిల్. తమిళంలో అధర్వ మురళి, కేథరిన్‌లు హీరో, హీరోయిన్లుగా నటించారు. మొదట ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ టైటిల్ కాస్తా వివాదంలో ఇరుక్కుంది. ఈ వివాదం వల్ల టైటిల్ ను మార్చుకోవలసి వచ్చింది. దాంతో తాజాగా ఈ సినిమాకి ‘అర్జున్ సురవరం’ టైటిల్‌గా మార్చారు.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు టీఎన్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి నుంచి వివాదాలను ఫేస్ చేస్తోంది. గతంలో సినిమా విడుదల రేపేనంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టర్‌లను విడుదల చేశారు. దీనిపై నిఖిల్ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా సినిమా టైటిల్‌నే మార్చుకోవాల్సి వస్తోంది. ఇన్ని వివాదాల మధ్య విడుదల కానున్న ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
