- Advertisement -
జమ్మూ, కాశ్మీర్లో ఓ స్కూల్లో బాంబు పేలుడు సంభవించింది. పూల్వామా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఒక పాఠశాలలో జరిగిన పేలుడు ఘటనలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కాకపోరాలోని నర్బల్ ప్రాంతంలో ఫలాహ్-ఇ-మిలాత్ అనే ప్రైవేటు పాఠశాలలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఆసమయంలో విద్యార్థులు ట్యూషన్‌కు హాజరయ్యారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని సంబంధిత అధికారులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తావ్రంగా గాయపడిన కొంత మంద విద్యార్థులను శ్రీనగర్ కి తరలించినట్లు చెప్పారు. అయితే పాఠశాల్లోకి బాంబు ఎలా వచ్చిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
