టాలీవుడ్‌లో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకోగా, నిర్మత జయ అనారోగ్యంతో మరణించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు కూడా రెండు క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌కు చెందిన మరో వ్యక్తి మరణించారు.సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్ననిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి 9 గంటలకు ఆయన మరణించినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.
తొలిసారి ఆయన ‘రంగవల్లి’ చిత్రానికి పాటలు రచించారు. ‘శ్రీమంజునాథ’, ‘రామదాసు’, ‘పాండురంగడు’, ‘షిరిడీ సాయి’, ‘అనగనగా ఒక ధీరుడు’, ‘ఝుమ్మంది నాదం’, ‘ఓం నమో వెంకటేశాయ వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వగృహం బైరాగిపట్టెడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
టాలీవుడ్‌లో మరో విషాదం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
