- Advertisement -

కేసీఆర్ పై జగన్ ఫ్యాన్స్.. మోడీపై బాబు ఫ్యాన్స్ ఆశలు..!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లేమో తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఆశలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రం ఇప్పుడు  తమ పార్టీ అధినేతను మోడీ రక్షిస్తాడనే ఆశలతో ఉన్నారు. వీరిలో ఎవరి ఆశలు ఫలిస్తాయో కానీ.. రాజకీయ పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘నోటుకు ఓటు’ వ్యవహారంలో తెలుగుదేశం అధినేతపై ఆరోపణలు చేస్తోంది వైకాపా. ఈ వ్యవహారంలో రేవంత్ పాత్రధారి అయితే.. సూత్రధారి చంద్రబాబు అని.. వైకాపా అంటోంది.

రేవంత్ మాటలే దీనికి రుజువులు అని వైకాపా నేతలు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని.. బాబుపై కూడా కేసులు నమోదు చేయాలని వైకాపా డిమాండ్ చేస్తోంది. బాబుపై ఈ రాజకీయ అవినీతి కేసు నమోదవ్వాల్సిందే.. ఆయన బండారాన్ని వెలికితీయాల్సిందేనని వైకాపా డిమాండ్ చేస్తోంది. ఎలాగూ కేసీఆర్  కూడా బాబుకు రాజకీయ శత్రువే కాబట్టి.. ఈ వ్యవహారాన్ని ఆయన ఈజీగా వదలడు బాబును కేసీఆర్ ప్రభుత్వం ఏ2గా చేరుస్తుందని వైకాపా వాళ్లు అనుకొంటున్నారు.

ఇక తమకు మోడీ ఉన్నారని అంటున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ మిత్రపక్షమే. ఈ వ్యవహారం నుంచి ఎలా బయపడాలో బాబుకు తెలుసు.. మోడీకి చెప్పి.. కేసీఆర్ పై ఒత్తిడి తీసుకు వచ్చి బాబు ఈ వ్యవహారం నుంచి బయటపడతాడు.. ఆయనపై కేసు పెట్టడం కూడా ఉండదు. కేసు కూడా ఎదుర్కోకుండానే బాబు బయటపడతాడు.. అని తెలుగుదేశం నేతలు విశ్వాసంతో ఉన్నారు. మరి వీరిలో ఎవరి నమ్మకం గెలుస్తుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -