తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు.తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై ఫేస్‌బుక్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.చంద్రయాన్-2లో చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ.. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదంటూ ఎద్దేవ చేశారు.
గతేడాది, లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తీసుకువచ్చారని, కానీ అక్షరాస్యత విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే అట్టడుగున ఉందని తేలిందని తెలిపారు.తెలంగాణలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలితో పేద రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండి పడ్డారు.ఆఖరికి రైతులకు యూరియా అందించే విషయంలోనూ కేసీఆర్ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శించారు.ద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గత బడ్జెట్ లెక్కలు తేలకముందే.. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ కొత్త బడ్జెట్ పేరుతో గారడికి సిద్ధమయ్యారు. కెసీఆర్ గారి లెక్క, పద్దుల విషయం ఏమోగానీ.. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారిప్రకటనల ద్వారా అర్థమవుతోందన్నారు.ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
