మెగా, నందమూరి కాంబినేషన్ మరోసారి.. ఈ సారి హీరోలు ఎవరెవరో తెలుసా..!

- Advertisement -

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు మధ్య కొన్నేళ్ల కిందటి వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లా ఉండే పరిస్థితి. 90లలో నెంబర్ వన్, నెంబర్ టూ పొజిషన్లో ఉన్న చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య తరచూ ఫ్యాన్ వార్ జరిగేది. అయితే ఇప్పుడు అంత పరిస్థితి లేదు. ఏకంగా మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కలసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి వీరిద్దరితో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. నందమూరి, మెగా హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారనేది టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈతరం మెగా, నందమూరి హీరోలు అయిన చరణ్,ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది.

ఇదిలా ఉండగా మరోసారి నందమూరి, మెగా కాంబోలో సినిమా రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అఖండ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి- బాలకృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు మెగా హీరో సాయి తేజ్ కూడా నటించనున్నట్లు సమాచారం.

అయితే ఇందులో సాయి తేజ్ ది హీరో పాత్ర కాదు. ఓ కీలక పాత్రలో మాత్రమే నటించనున్నారు.ఇదివరకే సాయి తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో నటించాడు. ఆ చొరవతోనే హరీష్ శంకర్ బాలకృష్ణ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించేందుకు సాయితేజ్ ని ఒప్పించినట్లు సమాచారం. ఏదిఏమైనా మునుపటిలా కాకుండా మెగా, నందమూరి హీరోలు కలిసి సినిమాల్లో నటించడం ఆసక్తికరంగా మారింది.

Also Read: వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ వచ్చేస్తోంది.. విడుదల ఎప్పుడంటే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -