Monday, May 6, 2024
- Advertisement -

ఈనెల 20న బ్ర‌హ్మోత్స‌వం విడుద‌ల!

- Advertisement -

మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా ఈనెల 20న విడుద‌ల కానుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నుల్లో చిత్ర‌బృందం అంతా.. త‌ల‌మున‌క‌లై ఉంది. ఈనెల 20న ఈ సినిమాని తీసుకురావాలంటే… రేత్రీంబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డాల్సిందే. దానికి చిత్ర‌బృందం ఫిక్స‌యిపోయింది కూడా. ఈనెల 20న బ్ర‌హ్మోత్స‌వం విడుద‌ల కావ‌డానికి ఎలాంటి అడ్డంకులూ లేవు.

కాక‌పోతే.. ఎడిటింగ్ ద‌గ్గ‌రే కాస్త జాప్యం జ‌రుగుతోంద‌ట‌. శ్రీ‌కాంత్ అడ్డాల సినిమాలు, క‌థ‌లు,స‌న్నివేశాలూ అన్నీ భావోద్వేగాల‌తో ముడిప‌డి ఉంటాయి. సీన్ లెంగ్త్ చూసుకోవ‌డం.. లెంగ్త్‌ని బ‌ట్టి క‌ట్ చేసుకోవ‌డం ఈ విష‌యాల్లోశ్రీ‌కాంత్ పూర్‌. అందుకే సీత‌మ్మ వాకిట్లో, ముకుంద సినిమాలు లెంగ్తీగా ఉంటాయి. స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి.

బ్ర‌హ్మోత్స‌వంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింద‌ట‌.క‌నీసం ప‌దిహేను స‌న్నివేశాలు…. బాగా లెంగ్తీగా సాగాయ‌ని.. దాన్ని క‌ట్ చేసే ప‌నిలో చిత్ర‌బృందం త‌ల‌మున‌క‌లు అయ్యింద‌ని టాక్‌. అయితే.. స‌న్నివేశాల్ని ట్రిమ్ చేయ‌డానికి శ్రీ‌కాంత్ అడ్డాల ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. సీన్లో కంటెంట్ ఉంటే… ఎంత లెంగ్త్ ఉన్నా చూస్తార‌ని చెబుతున్నాడ‌ట‌. అయితే… ఆడియ‌న్స్ మారిపోయార‌ని, వాళ్ల‌కేదైనా షార్ట్‌గా చెబితేనే ఇష్ట‌మ‌ని మ‌హేష్ క‌న్వెన్స్ చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యంలోనే చిత్ర‌బృందం త‌ర్జ‌న‌ భ‌ర్జ‌న‌లు ప‌డుతోంద‌ని, అందుకే ఎడిటింగ్ ప్ర‌క్రియ ఆల‌స్యంగా సాగుతోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -