నటి మంజు సవార్కర్ అంటే మనకు తెలియకపోచ్చు కాని ,కేరళలో బాగానే ఫేమస్ ఈ భామ. ఇప్పుడు ఈమె గురించి చర్చ ఎందుకనే కదా మీ ప్రశ్న. ఏం లేదండి మంజు సవార్కర్ ఓ లాడ్జీలో అర్ధరాత్రి పెద్ద గొడవ చేసింది. పూర్తి వివారాల్లోకి వెళ్తే…నాగర్ కోయిల్ పరిసర ప్రాంతాల్లో ఓ మలయాళ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నటించే వారందరికి నాగర్ కోయిల్ లో ఓ లాడ్జిలో బస చేస్తున్నారు. నటి మంజుకి కూడా ఇదే హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన యూనిట్ సభ్యులు వారి వారి గదుల్లోకి వెళ్లిపోయారు. మంజు మంచంపై దుప్పట్లను హోటల్ సిబ్బంది మార్చకపోవడాన్ని గుర్తించి వారిని ప్రశ్నించింది.
దీనికి హోటల్ సిబ్బంది నుంచి దురుసు సమాధానం రావడంతో గొడవ పెద్దదిగా మారింది. హోటల్ సిబ్బందిలో ఒకరు ఆమెపై దాడి చేసినట్లు సమాచారం. సిబ్బంది సమాచారంతో అక్కడకి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నటి తమకు రూ.60 వేల అద్దె చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని ప్రశ్నిస్తే తమతో గొడవకి దిగిందని హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నటి మంజు మాట్లాడుతూ.. ”నా గదిని శుభ్రం చేయకపోవడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తే దానికి వారు నాకు సమాధానం ఇవ్వకుండా నేను అద్దె చెల్లించలేదని గొడవకి దిగారని , పైగా నేను అద్దె చెల్లించాలని అంటున్నారని చెప్పుకొచ్చింది. హోటల్ నుంచి ఖాళీ చేసే సమయంలో అద్దె చెల్లిస్తానని తెలిపింది మంజు.
- టీమిండియాలోకి ఎంట్రీపై భువి!
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రిపేర్ అని ఆపాడు.. ప్రాణం తీశాడు!
- స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా జగన్
- లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత !
