- Advertisement -
ఏపీ ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయంగా దిగిన జనసేన పార్టీ ఎన్నికల జోరు పెంచింది. ఇప్పటి వరకు పవన్ ఒక్కడే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కు సోషల్ మీడియాలో మద్దతు తెలుపిన మెగా హీరోలు ఎవరూ ప్రత్యక్షంగా ప్రచారం చేయలేదు. ప్రచారం ముగింపుకొచ్చేసరికి రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ మీకు తోడుగా మేమున్నామంటూ పవన్‌కు బాసటగా నిలిచారు. నాగబాబు బరిలో ఉన్న నరసాపురం నియోజకవర్గలో గత వారం ఆయన కొడుకు వరుణ్‌తేజ్, కుమార్తె నిహారిక ప్రచారం చేశారు.
ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయిన పవన్ ను రామ్ చరణ్ ఆయన్ని విజయవాడలో పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. జనసేన వెంట తానున్నానంటూ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం పవన్ నిర్వహించిన ప్రచారంలో అల్లు అర్జున్ తళుక్కున మెరిశా
