దుమ్మురేపుతున్న ‘పుష్ప’ టీజర్!

- Advertisement -

గత ఏడాది అలా వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వచ్చింది. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ‘పుష్ప’ టీజర్‌ విడుదల చేసింది. ఈ చిత్రం ఎర్ర గంధపు అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న వారి జీవితాల చుట్టూ తిరుగుతుంది.

టీజర్ ను 8.19 గంటలకు రిలీజ్ చేయగా కొద్దివ్యవధిలోనే 4 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు ధనంజరు, ప్రకాష్‌రాజ్‌, జగపతి బాబు, హరీష్‌ ఉతామన్‌, వెన్నెల కిషోర్‌, అనీష్‌ కురువిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తగ్గేదే.. లే” అంటూ అంటూ చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుందనడంలో సందేహం లేదు.

- Advertisement -

మొత్తానికి పుష్ప చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ సరికొత్త ఫార్మాట్లో తెరకెక్కిస్తున్న వైనం తాజా వీడియో చూస్తుంటే తెలిసిపోతుంది. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -