తెలుగు ప్రముఖ యాంకర్స్‌లో అనసూయ ఒకరు. తన హాట్ హాట్ అందాలతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ప్రముఖ ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్థస్త్ ద్వారా బాగా పాపులర్ అయింది ఈ భామ. అటు టీవీ షోలతో పాటు సినిమాలలో కూడా నటిస్తు ఫుల్ బిజీ ఆర్టిస్‌గా మారింది. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మాత్తగా నటించి అందరిని మెప్పించింది. అనసూయ తాజాగా లీడ్‌రోల్లో నటించిన చిత్రం కథనం. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. కథనం సినిమా టీజర్‌ను మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమాలో అనసూయ దర్శకురాలిగా కనిపించబోతోంది. తాను రాసుకున్న కథలోని సన్నివేశాలు రియల్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ జరగడంతో అనసూయ ఏ విధంగా ప్రమాదాలను ఫేస్ చేసిందనేది సినిమాలో అసలు పాయింట్. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను థియోటర్లకు రప్పిస్తుందో చూడాలి.రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
- Advertisement -
‘అనసూయ’ను జనాలు చూస్తారా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
