- Advertisement -

మళ్లీ అదే అందంతో.. దుమ్ము లేపిన యాంకర్ ఉదయభాను

- Advertisement -
Anchor Udayabhanu Is Back

హాట్ యాంక‌ర్‌గా ఉద‌య‌భాను 15 సంవత్సరాల పాటు  తెలుగు బుల్లితెర‌పై తన హ‌వా కొనసాగించింది. అయితే రాను రాను ఆమెకు క్రేజ్ తగ్గిపోయింది. కొత్త కొత్త యాంకర్స్ రావడం వల్ల ఆమెకు ఛాన్సులు మెల్లిగా తగ్గాయి. ఆమె చేసిన బుల్లితెర షోలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

దాంతో ఏం చేయాలో అర్ధం కాక.. బుల్లితెరకు దూరం అయింది. ఆ తర్వాత ఆమె గర్బవతి అవ్వడంతో పాటు కవల పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఉదయ భాను. తాజాగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన నక్షత్రం చిత్రం ఆడియో రిలీజ్ వేడుకలో ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించింది. అయితే ఇందులో భాగంగా కృష్ణవంశీని మీరు ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు.. తీసెందేమో 20 సినిమాలు. మరి మీకెవరన్నా చుక్కలు చూపించారా.. అని బాను అడిగితే… నవ్వుతూ నేనే చాలామందికి చూపించాను చుక్కులు అన్నాడు వంశీ.. మీ లైఫ్ లో నక్షత్రం ఎవరు.. అని అడ‌డ‌గా నా కొడుకు అని సమాధానం ఇచ్చాడు.. మ‌రి రమ్యకృష్ణ ఎవరని అడగ‌గా.. ఆమె ఆకాశం లాంటిదని..  భార్య గొప్పతనాన్ని డైరెక్టుగానే పొగిడేశాడు మ‌న క్రియేటివ్ డైరెక్ట‌ర్‌.

అయితే గతంలోలాగ‌ అల్లరి చిల్లరిగా మాట్లాడుతూ కార్యక్రమంను నడిపించే భాను ఇప్పుడు మాత్రం కాస్త హుందాగా నడిపించడం కనిపించింది. మునుపటితో పోల్చితే ఏమాత్రం గ్లామర్‌ తగ్గలేదు. అదే అందం మరియు అదే ఫిజిక్‌తో ఉదయభాను ఆకట్టుకుంటుంది. మళ్లీ రీ ఎంట్రీతో సుమ వంటి పెద్ద యాంకర్స్ కు పోటీ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. బుల్లి తెరపై రియాల్టీ షోల్లో కూడా త్వరలో భాను కనిపించే ఛాన్సులు ఉన్నాయి. 

{youtube}i8ZJ2vrlNyg{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చిన యాంకర్ సుమ
  2. రాజకీయ నాయకుడితో శృంగారం చేస్తూ బుక్ అయిన యాంకర్‌
  3. తన అరస్ట్ విషయంపై యాంకర్ ప్రదీప్ ఏమన్నాడంటే..?
  4. యాంకర్ సుమ ని కూడా అలా చేశారుగా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -