ఆర్ఆర్ఆర్ కు పోటీగా అఖండ.. రిస్క్ వద్దంటున్న అభిమానులు..!

- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 28 వ తేదీన విడుదల చేయాలని ముందుగా మేకర్స్ భావించారు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ లో డిలే జరిగింది. ఇటీవలే ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ పూర్తయింది.

కాగా ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ నందమూరి అభిమానులను కలవర పెడుతోంది. దీనికి కారణం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల కావడమే. రాజమౌళి సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో విడుదల అవుతూ ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఆయన సినిమాకు వస్తుంటారు. దానికి తోడు ఆ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

ఒకవేళ నిజంగా అఖండ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదల అయితే.. ఐదు రోజుల గ్యాప్ లోనే పెద్ద సంఖ్యలో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. అఖండ సినిమా కొన్ని థియేటర్లలో మిగిలే ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకే ఆసక్తి చూపే అవకాశం ఉంది. దీనివల్ల అఖండ సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయని నందమూరి అభిమానులు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందు వెనక కాకుండా మరో డేట్ లో ఈ మూవీ వస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. మరి అఖండ అదే డేట్ లో విడుదల అవుతుందో.. డేట్ మారుతుందో వేచి చూడాలి.

Also Read: తమ్ముడి సినిమాకు పోటీగా అన్నయ్య సినిమా

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -