దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. అద్భుతమైన కలెక్షన్స్ వసూళ్లు సాధించింది. ఇంకోవైపు బుల్లితెర మీద అరంగేట్రం చేసి.. అక్కడ కూడా సత్తా చాటేస్తున్నారు చిరు.
తన స్టైల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు డీల్ చేస్తున్న విధానం.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు చిరు తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టేశారని సమాచారం. చిరు తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫిక్స్ చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అంతే. అయితే.. ఖైదీ నంబర్ 150 సక్సెస్ మీట్ చేద్దాం అనుకొని చివరి నిమిషంలో రద్దు కావడంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తన నెక్ట్స్ సినిమాని ఏప్రిల్ లో ప్రారంభించేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్.. మెగా ఫ్యాన్స్ కోసం 151వ సినిమా లాంఛింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారట.
ఏప్రిల్ లో ఈ లాంఛింగ్ కార్యక్రమం పూర్తి చేసి.. మే నెలలో మూవీ షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా… రామ్ చరణ్ 80 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Related
