సైబర్ సెల్ లో కంప్లైంట్ నమోదు చేసిన మెగా అల్లుడు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘విజేత’ సినిమాతో హీరోగా మారిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయాడు. ఇక తాజాగా తన రెండో సినిమాకి సిద్ధమవుతున్నాడు ఈ మెగా అల్లుడు. అయితే సినిమా పరంగా కాకుండా ఈసారి సోషల్ మీడియా వల్ల వార్తల్లోకెక్కాడు కళ్యాణ్ దేవ్. అసలు కథలోకి వెళితే, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తో విసిగిపోయిన కళ్యాణ్ దేవ్, ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లోని నెగెటివ్ కామెంట్లను, భూతులను చూసి సైబర్ సెల్ లో కంప్లైంట్ నమోదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇంస్టాగ్రామ్ కి లేఖ రాశామని వారు రెస్పాన్స్ ఇవ్వగానే దర్యాప్తు చేపట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మరి ఈ కేసు సంగతి ఏమవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కళ్యాణ్ దేవ్ శ్రీజ కి రెండవ భర్త. శిరీష్ భరద్వాజ్ తో విడిపోయిన తరువాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ మధ్యనే వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపకు నవిష్క అని పేరు పెట్టారు. మరోవైపు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న రెండవ సినిమా కి పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా మెగా అల్లుడు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -