కంటెస్టెంట్ బుగ్గ‌ను కొరికేసిన పూర్ణ‌.. ఒక్క‌సారిగా షాక్ అయిన ఫ్యాన్స్!

- Advertisement -

బుల్లి తెర ప్రోగ్రాంల‌లో ఢీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ డాన్స్ షో ఎన్నో ఏండ్ల‌ నుంచి టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ ఢీ షోకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో వ‌చ్చే అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లు అంద‌రిని ఎంత‌గానో అల‌రిస్తాయి. ఈ షోనుంచి వ‌చ్చిన ఎంతో మంది కంటెస్టెంట్లు పాపులర్ కొరియోగ్రాఫర్స్ కూడా అయ్యారు. దాంతో ఈ షోకు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది.

అయితే ఈ షోలో మాస్ట‌ర్ గా కొన‌సాగుతున్న‌ శేఖర్ మాస్టర్ కూడా ఈ షో నుంచే వ‌చ్చిన కంటెస్టెంట్ అని తెలిసిందే. ఇక షో విష‌యాల‌నికి వ‌స్తే.. ప్రతి వారం ఈ షో లో కంటెస్టెంట్స్ ఇచ్చే పెర్పార్మెన్స్ మాములుగా ఉండ‌దు. ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య ఈ షో కొంత విమ‌ర్శ‌లకు గుర‌వుతుందని చెప్పాలి. దానికి కారణం డాన్స్ మ‌ధ్య‌లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది చేసే కామెడీ అని చెప్పాలి.

ఇప్పుడు ఢీ షో లో జడ్జ్ గా ఉన్న పూర్ణ పై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఇటీవల ఒక కంటెస్టెంట్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కు పూర్ణ ఫిదా అయిపోయింది. దాంతో అందరూ చూస్తుండగానే ఆ కంటెస్టెంట్ బుగ్గను కొరికేసింది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది.దీన్ని చూసిని ప‌లువురు వీరి చేస్టెలు రోజురోజుకు శృతి మించుతున్నాయని అంటున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -