Monday, May 13, 2024
- Advertisement -

కేర‌ళ‌కు మ‌న హీరోలు ఇచ్చింది ఒక‌టి.. చెప్పుకునేది మ‌రోక‌టి..!

- Advertisement -

మ‌న హీరోలు ఇస్తున్న‌ది నిజ‌మైన విరాళాలేనా?

కేరళ రాష్ట్రం భారీ వ‌ర్షాలు వ‌ల్ల స‌ర్వ‌స్వం కోల్పొయిన సంగ‌తి తెలిసింది.దేశ విదేశాల నుంచి కేర‌ళ‌కు భారీ ఆర్థిక సాయం అందుతుంది.ఇక మ‌న స్టార్ హీరోలు సైతం త‌మ‌కు తోచిన సాయం చేస్తున్నారు.అయితే ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు స‌మ‌స్య‌.హీరోలు ఇస్తున్న అమౌంట్ వేరు,హీరోగారి అభిమానులు చెప్పుకుంటున్నఅమౌంట్ వేరు.తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.కేరళలో వరద బాధితుల సహాయార్ధం త‌మిళ హీరో విజయ్ రూ.14 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. విజయ్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేశారు.అయితే అస‌లు విజ‌య్ ఇచ్చింది మాత్రం రూ.70 లక్షల సాయం మాత్ర‌మే చేశార‌ట‌.

దీనిని ఆయ‌న అభిమానులు 14 కోట్లుగా ప్ర‌మోట్ చేసుకున్నారు.అలాంటి సంఘ‌ట‌నే మ‌రోక‌టి జ‌రిగింది.పోర్చుగల్ దేశానికి చెందిన ప్ర‌పంచ మేటి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియనో రోనాల్డో కేర‌ళ‌కు భారీ ఆర్థిక సాయం చేశాడని సోష‌ల్ మీడియాలో గ‌త రెండు రోజులుగా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.అయితే ఈ వార్త‌లో నిజం లేద‌ని తేలింది.అస‌లు క్రిస్టియనో రోనాల్డోకు ఇండియాలో కేర‌ళ అనే రాష్ట్రం ఉంద‌ని కూడా తెలియ‌ద‌ని ,కావ‌ల‌నే ఇలాంటి పుకార్లును సృష్టిస్తున్నార‌ని తెలిసింది.అస‌లే భారీ వ‌ర్షాలు వ‌ల్ల న‌ష్ట‌పోయిన కేర‌ళ సాయం కోసం ఎదురు చూస్తుంది.మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఆర్థిక సాయం పేరిట ఫేక్ వార్త‌లు రావ‌డం ఎంతైనా బాధ క‌లిగిస్తుంది.సోష‌ల్ మీడియాను మంచి కోసం వాడ‌క‌పోయిన ప‌ర్లేదు కాని,ఇలా మిస్ యూస్ చేయొద్ద‌ని కేర‌ళ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -