Friday, May 3, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జీవితాన్ని అద్భుతంగా చూపించిన వ‌ర్మ‌ (రివ్యూ)

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి , తెలుగు వెండితెర దైవం నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌లోని కొన్ని సంఘ‌ట‌ల‌న ఆధారంగా వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోకి ఆయ‌న రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తీ ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి ఈ సినిమా నిర్మిచ‌డం జ‌రిగింది. ఎన్టీఆర్ త‌న చివ‌రి రోజుల్లో ఎలాంటి దుర్భ‌ర జీవితాన్ని గ‌డిపాడో త‌న సినిమాలో చూపిస్తానంటున్నాడు వ‌ర్మ‌. ఎన్టీఆర్ నిజజీవితంలో తన అల్లుడు చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పొడిచారో అన్న కథాంశం అని చెప్పగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా విడుద‌ల‌ను కొందరు అడ్డుకుంటున్న‌ప్ప‌టి తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఈ రోజే విడుద‌ల అయింది. మ‌రి వివాదాలు మ‌ధ్య విడుద‌ల అయిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథ :
1989 ఎన్నికలలో విజయ్(ఎన్టీఆర్) ఘోర పరాజయం చ‌వి చూస్తాడు. ఆ తర్వాత ఆయ‌న జీవితంలోకి తన జీవిత చరిత్ర రాస్తానంటూ యజ్ఞ శెట్టి(లక్ష్మీ పార్వతి) వస్తారు. అలా ఆ ఇద్దరి మధ్య బంధం ఏర్పడి అది పెళ్ళికి దారి తీస్తుంది. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వతీ ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న జీవితంలో అనుహ్యా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. లక్ష్మీ పేరు వారి పార్టీలో ఎక్కువగా వినిపించడంతో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు(శ్రీతేజ్) ఎన్టీఆర్ కుటుంబీకులతో కలిసి పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకుందామని చూస్తారు. ఆ త‌రువాత ఎన్టీఆర్ జీవితం ఏమైంద‌నేది తెర మీద చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
ఎన్టీఆర్ జీవితం అనే స‌రికి అంద‌రికి కాస్తా అతృత‌గానే ఉంటుంది. అయితే ఈ సినిమాకు వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, అది కూడా కాంట్ర‌వ‌ర్సీగా తెర‌కెక్కించ‌డంతో సినిమాకు ఎక్క‌డ లేని హైమ్ వ‌చ్చింది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే..ఈ సినిమా మొదలు కావడమే ఎన్టీఆర్ గత జీవితానికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ వర్మ మార్క్ లో టైటిల్ కార్డ్స్ పడడంతో మొదట్లోనే ఆసక్తి మొదలవుతుంది. లక్ష్మీ పార్వతి వల్ల ఎన్టీఆర్ కుటుంబంలో జ‌రిగిన గొడ‌వ‌లు పార్టీలో పుట్టిన పుకార్లు అన్నింటిని స్ప‌ష్టంగా చూపించారు వ‌ర్మ‌. చెప్పాల‌నుకున్న‌ది సూటిగా సుత్తి లేకుండా అంద‌రికి అర్థం అయ్యేలా చెప్పాడు వ‌ర్మ‌. ఈ సినిమా మొదలు కావడమే ఎన్టీఆర్ గత జీవితానికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ వర్మ మార్క్ లో టైటిల్ కార్డ్స్ పడడంతో మొదట్లోనే ఆసక్తి మొదలవుతుంది.

లక్ష్మీ పార్వతి వల్ల కుటుంబంలో మరియు పార్టీలో పుట్టిన పుకార్లు,అంతర్గత గొడవలు వర్మ మరియు అగస్త్యలు చాలా రియలిస్టిక్ గా తీశారు అని చెప్పాలి.వర్మ మరియు అగస్త్యలు తాము అనుకున్నదాన్ని డైరెక్ట్ గా చూపించడంలో ఎలాంటి గోప్యం హడావుడి లేకుండా సూటిగా సుత్తి లేకుండా ఇద్దరు దర్శకులు సఫలం అయ్యారని చెప్పొచ్చు. ఫస్టాఫ్ కాస్తా సాగ‌దిసిన‌ట్లు అనిపించిన‌ప్ప‌టికి సినిమాను ఆసక్తిగా తెర‌కెక్కించడంలో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ విజ‌యం సాధించార‌నే చెప్పాలి. ఇక సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి బాబు వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్ అలాగే అత్యంత కీలక ఘట్టమైనటువంటి వైస్రాయ్ ఎపిసోడ్ లు చివర్లో ఎన్టీఆర్ మరణానంతరం నిజమైన ఎన్టీఆర్ పార్థివదేహాన్ని చూపించే సీన్లు ప్రధాన హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు.

న‌టీన‌టుల ఫ‌ర్మామెన్స్‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్‌గా న‌టించిన విజయ్ కుమార్ ఈ పాత్ర‌కు ప్రాణం పోశారని చెప్పాలి. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌ను ఆయ‌న చాలా స‌మ‌ర్థ‌వంతంగా హ్యాండిల్ చేశారు. అలాగే చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టించిన శ్రీతేజ్ మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు. ఇక సినిమాలో టైటిల్ రోల్లో న‌టించిన యజ్ఞ శెట్టి త‌న న‌ట‌న‌తో సినిమాకు ప్రాణం పోశార‌ని చెప్పాలి. పార్టీలో మారుతున్న సమీకరణాలు చూసి లోలోపల రగిలిపోయే వ్యక్తిగా శ్రీతేజ్ తన ముఖ కవలికలతోనే అద్భుత నటనను ప్రదర్శించారు. బాల‌కృష్ణ‌, హరికృష్ణ పాత్ర‌ల్లో న‌టించిన న‌టులు కూడా త‌మ ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతిక ప‌రిజ్ఞ‌నం ప‌నితీరు:
సాంకేతిక ప‌రిజ్ఞ‌నం ప‌నితీరు విష‌యానికి వ‌స్తే అన్ని తానై ముందుకు న‌డిపించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. సినిమా ప్ర‌తి ఫ్రేమ్‌లో ఆయ‌న ప‌డిన క‌ష్టం క‌నిపిస్తోంది. ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాతో తానే ఏంటో మ‌రోసారి నిరుపించుకున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ. సినిమాకు ఇంత‌టి హైప్ రావడానికి కార‌ణం కూడా అత‌నే అని చెప్పాలి. నిర్మాణ విలువులు బాగున్నాయి. సినిమాటోగ్ర‌ఫి చాలా బాగుంది.

బోట‌మ్ లైన్‌:
వెండితెర మీద ఎన్టీఆర్ చివ‌రి రోజుల్ని విజ‌యవంతంగా చూపించిన వ‌ర్మ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -