పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు అయినప్పటి నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే కాటమరాయుడు షూటింగ్ మొదలు పెట్టి చాలా రోజులు అయిన ఇప్పటి వరకు పవన్ సెట్‌లోకి అడుగు పెట్టలేదు. ఇక హీరోయిన్ శృతీహాసన్ డేట్లు ఇచ్చినా పవన్ రాకపోవడంతో ఆమె డేట్లు సైతం వేస్ట్ అవుతున్నాయి.
దాంతో శృతి తన డేట్లు అన్ని వేస్ట్ అవుతున్నాయి అని చాలా బాధపడుతోందట. ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో శృతి సింగం-3 షూటింగ్ కోసం లండన్ వెళ్లిందని…ఆమె అక్టోబర్ ఫస్ట్ వీక్‌కు గాని రాదని తెలుస్తోంది. నిజానికి శృతి సెప్టెంబర్ నెల మొత్తం కాటమరాయుడు సినిమాకే కేటాయించినా పవన్ తన పొలిటికల్ మీటింగులతో బిజీ అవ్వడంతో అవన్నీ వేస్ట్ అయిపోయాయి.
దీంతో డాలీ ఈ నెల 24 నుంచి స్టార్ట్ అయ్యే షెడ్యూల్‌లో ఓన్లీ పవన్ మీద సీన్లు షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ చిత్రంకు సినిమాటోగ్రాఫర్ గా బెంగాల్ టైగర్ చిత్రానికి పనిచేసిన సౌందర్‌రాజన్‌ని తీసుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో సౌందర్‌రాజన్‌ని ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సౌందర్ రాజన్ ప్లేసులో అత్తారింటికి దారేది సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లను ఎంపిక చేశారని తెలుస్తోంది. సో మార్చిలోగా ఈ చిత్రం రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ చిత్ర యూనిట్‌కు వరస షాకులు తగులుతున్నాయి.
Related
