Saturday, April 20, 2024
- Advertisement -

వాళ్లను పెట్టి సినిమాలు తీయండి: నాగబాబు

- Advertisement -

ఏపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మెగా బ్రదర్ నాగబాబు. పవన్ కల్యాణ్ పై కక్ష సాధింపు కోసమే భీమ్లానాయక్ రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరల పెంపు జీవోను విడుదల చేయలేదని విమర్శించారు. మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు అంటూ సవాల్ విసిరారు. ఈ మేరకు తాజా వీడియో విడుదల చేశారు. ‘‘మీకున్న వ్యక్తిగత అజెండాల కారణంగా పవన్‌ని అణగదొక్కేయాలనో, లేదా సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనో ప్లాన్‌ చేస్తున్నారు.

దాని కోసమే మీరు పరిశ్రమపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యాపారాన్నైనా మీ చేతుల్లోకే తీసుకుంటున్నారు కదా.. అలాగే సినిమా పరిశ్రమని సైతం ఆంధ్రా వరకూ మీరే తీసుకోండి. వెల్లంపల్లి, కొడాలి వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు చేయండి. వాళ్లు బాగా నటిస్తారు. ఆ నటన ముందు మేము ఏ మాత్రం సరిపోం. లేదంటే ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్‌ చేసేయండి. కొన్నిరోజులు నష్టపోతాం. వేరే దారి చూసుకుని మా సినిమాలు విడుదల చేస్తాం. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.

యూట్యూబ్‌, ఓటీటీ ఎలా చూసుకున్న మాకు డబ్బులు వస్తాయి’’ ‘‘చిరంజీవి పెద్ద మనిషి తరహాలో వెళ్లి జగన్‌తో మాట్లాడారు. దానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా స్పందించారు. దాన్ని నేను కాదనడం లేదు. కానీ జీవో ఇవ్వడానికి ఇంత ఆలస్యమేమిటి? పాత జీవోని అమలు చేయకుండా.. మధ్యలో మీరు తీసుకువచ్చిన జీవో చెల్లదని తెలిసి కూడా దాని ప్రకారమే టికెట్లు అమ్మడం ఏమిటి? ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వల్ల కల్యాణ్‌బాబు, లేదా మేము మీ వద్దకు వచ్చి బతిమలాడుకుంటానుకుంటున్నారా? అలా జరగదు’’అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -