Friday, April 26, 2024
- Advertisement -

ప్రభుత్వానికి నమ్రత శిరోద్కర్ కీలక సూచనలు.. వైరల్ !..

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ తాజాగా దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించారు. అలాగే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమానికి కొన్ని సూచనలు చేశారు. దేశంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న భారత దేశంలో కరోనా మొదటి దశ కంటే రెండో దశ ప్రజలపై తీవ్రం ప్రభావం చూపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు వ్యాక్సినేషన్ వేయడం కష్టతరంగా మారింది. ఇలాంటి వారి కోసం ముంబై, భోపాల్ వంటిప్రదేశాల్లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. వారు ఉన్న చోటకు వెళ్లి, కారులోనే ఉన్నా కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు.

Also read:అషుతో డేటింగ్ పై రాహుల్ షాకింగ్ కామెంట్స్..!

దేశంలోనే వినూత్నంగా భోపాల్, మధ్య ప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు వారు ఉన్న చోటికి వెళ్లి కారులోనే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇది ఎంతో మంచి నిర్ణయమని, మిగతా అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకున్నారు. అలాగే ప్రజలనుద్దేశించి కరోనాను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆమె కోరింది.

Also read:ఇప్పటి వరకు ఎవరు చూడని మెగా డాటర్ నిహారిక ఫోటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -