Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ

- Advertisement -

ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావంతో ఎక్కువ మంది సందర్శకులు లేకుండా కొద్ది మందితో ఆయన తన తండ్రికి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పెన్నిధి అని బాలకృష్ణ కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. తెలుగు చిత్ర సీమ అభివృద్ది గురించి ఎంతో కృషి చేశారని.. ఎంతో మంది నటులు ఆయనను ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు.

ఎంతో మంది సినీ కార్మికులకు చేయూత ఇచ్చి వారికి అన్నగా మారారని అన్నారు. నటుడిగానే కాదు.. రాజకీయ నేతగా తెలుగు గౌరవాన్ని పెంపొందించారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌పై ఎంతోమంది పుస్తకాలు రాశారని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు చెప్పారు.

ఇదిలా ఉంటే ఈ సంవత్సరం కరోనా కారణంగా తన తండ్రి ఘాట్ వద్దకు వెళ్లే పరిస్థితిలో లేనని మరో తనయుడు రామకృష్ణ తెలిపారు. అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

పెళ్లి తర్వాత కాజల్ దూకుడు మాములుగా లేదు.. హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న కాజల్!

నేటి పంచాంగం,శుక్రవారం(28-05-2021)

సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -